పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ ప్రపంచకప్లోభారత్- పాక్ తలపడతాయా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ తనదైన శైలిలో స్పందించారు.
"ఆడకపోతే ఓడినట్టే" - cricket
ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరించడమంటే పోరాటం లేకుండా ఓటమిని అంగీకరిండమేనని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.
శశిథరూర్
1999లో కార్గిల్ యుద్ధ సమయంలోనే ప్రపంచకప్ జరిగింది. అందులో పాకిస్థాన్‌పై టీమిండియా ఆడింది. విజయం సాధించింది. అదే విధంగా ఈ సంవత్సరం జరిగే ప్రపంచకప్‌లోనూ ఆడి తీరాలి. పోటీ నుంచి వైదొలగడం లొంగిపోవడం కంటే దారుణం. పోరాడకుంటే ఓడిపోయినట్టే -- శశిథరూర్, కాంగ్రెస్ నేత