తమిళ నటుడు అజిత్‌ను సినీహీరోగానే కాక వ్యక్తిగతంగానూ చాలా మంది ఇష్టపడ్తారు. ఎందుకంటే ఫేం ఉన్నా సింపుల్‌గా ఉంటాడని, హంగులు, ఆర్భాటాలకు వెళ్లడని చెప్తుంటారు. ఈ విషయంలో కుటుంబం అంతా ఇలానే ఉంటారా అనేలా ఓ ఘటన జరిగింది. ఓ అభిమానితో అజిత్ భార్య ఫోటో చూస్తే నిజమే అనిపిస్తుంది. ఇప్పుడా సెల్ఫీ సామాజిక మాధ్యమాలలో బాగా చక్కర్లు కొడుతోంది.
ఎదిగినా ఒదిగే మనసు
కోలీవుడ్ తలా అజిత్ సతీమణి షాలిని ఇటీవల ఒక అభిమానితో ఫొటో దిగింది. ఆ సెల్ఫీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అజిత్ సతీమణి షాలిని
ఇంత సింపులా...
ఆ చిత్రంలో షాలిని చేతిలో నోకియా 1100 జీఎస్ఎమ్ ఫోన్ ఉంది. అందుకే ఈ విషయం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇంత పేరు, డబ్బు ఉండి సింపుల్‌గా ఉంటున్నారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. షాలిని బాల నటిగా 40కి పైగా చిత్రాలు నటించింది. నాయికగా 10 సినిమాల్లో కనిపించింది. 1999 అమరకలమ్ చిత్రీకరణలో ప్రేమలో పడిన వీరిద్దరూ... 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు అనౌషా,అద్విక్.