చైనీస్ దిగ్గజ మొబైల్ సంస్థ షియోమీ భారత్‌లో తమ ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌ను ఎంపిక చేసుకుంది. భాగస్వామ్యానికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు.
షియోమీతో రణ్వీర్ - smart phones
భారతలో మొబైల్ విక్రయాల్లో జోరు చూపిస్తున్న షియోమీ..తమ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్వీర్తో ఒప్పందం కుదుర్చుకుంది.
దేశంలో తక్కువ మంది మాత్రమే ఆన్లైన్లో చరవాణులు కొంటున్నారు. మిగతా వారిని ఆకట్టుకోవాలంటే బ్రాండ్‌కు ప్రచారం కల్పించి వారిని ఆకర్షించాలి. అందుకే రణ్వీర్తో ఒప్పందం కుదుర్చుకున్నాం
--అనుజ్ శర్మ, షియోమీ ఇండియా ఛీప్ మార్కెటింగ్ ఆఫీసర్.
2018లో తన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను భారత్‌లో విస్తరించింది షియోమీ. 28 శాతం వాటాతో ముందంజలో నిలిచింది. 24 శాతం షేర్‌తో సామ్సంగ్ రెండో స్థానంలో ఉంది. మొదటగా ఆన్లైన్లో అమ్మకాలు ప్రారంభించిన షియోమీ.. గత కొన్ని నెలల నుంచి ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ ఆధిపత్యం చూపిస్తోంది.