హీరోలకంటే తామేం తక్కువ కాదంటోంది పూజా హెగ్డే. నాయుకా ప్రాధాన్య చిత్రాలూ వంద కోట్లు సాధించాయంటోందీ ముద్దుగుమ్మ. రాజీ, వీరే ది వెడ్డింగ్ లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణంది.
ఇంత చేస్తున్నా పారితోషకం విషయంలో మాత్రం హీరోల కంటే హీరోయిన్లకు తక్కువ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మహిళా ప్రాధాన్య చిత్రాలకూ మంచి వసూళ్ల వస్తాయని, నిర్మాతలకు ఈ విషయం ఇప్పటికే అర్థమై ఉంటుందని తెలిపింది.
హీరోలతో సమానంగా హీరోయిన్లకు పారితోషికం అందించాలని కోరుతోంది పూజా. మహిళా నిర్మాతలు ఎక్కువమంది వచ్చినపుడే ఈ సమస్య పరిష్కారమవుతుందని స్పష్టం చేసింది.
- 2018 ఫుల్ బిజీ:
గతేడాది నాకు బాగా కలిసొచ్చింది. చిత్రాలతో ఫుల్ బిజీగా గడిపాను. కుటుంబసభ్యుల్ని కలవడానికీ తీరిక లేదు. ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంది.
- దేవుడే నా గాడ్ ఫాదర్: