sitara

ETV Bharat / cinema

మేడం ఒక్క ఫోటో... - mumbai

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన "ఫోటోగ్రాఫ్" సినిమా ట్రైలర్ విడుదలైంది.

ఫోటోగ్రాఫ్

By

Published : Feb 18, 2019, 8:54 PM IST

విలక్షణ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "ఫోటోగ్రాఫ్". ముంబయి వీధుల్లో తిరిగే ఫోటోగ్రాఫర్​ రఫీగా నవాజ్ కనిపించనున్నాడు. హీరోయిన్​గా సన్యా మల్హోత్రా నటించింది.

పెళ్లి పోరు నుంచి తప్పించుకునేందుకు కథానాయికను తనతో కలిపి ఫోటో దిగాలని హీరో కోరతాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఎటువైపుకు దారితీశాయనేదే చిత్ర కథాంశం.

2019లో సుడాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్​లోనూ, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్​లోనూ ఈ చిత్రం ప్రదర్శితమైంది. పీటర్ సంగీతమందించారు. రితేశ్ బత్రా దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా మార్చి 15న విడుదలకు సిద్ధమౌతోంది.

ABOUT THE AUTHOR

...view details