sitara

ETV Bharat / cinema

వెంకీ సరసన పాయల్ ?

వెంకటేష్, నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న 'వెంకీమామ' చిత్రంలో పాయల్ రాజ్​పుత్ హీరోయిన్​గా ఎంపికైనట్లు సమాచారం.

By

Published : Feb 18, 2019, 9:16 AM IST

వెంకిమామ చిత్రంలో పాయల్

వెంకటేష్, నాగచైతన్య కథానాయకులుగా తెరకెక్కుతున్న 'వెంకీమామ' సినిమా చిత్రీకరణ ఈ వారంలో మొదలవుతుంది. 'జై లవకుశ' చిత్రాన్ని తెరకెక్కించిన బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్​గా 'ఆర్ఎక్స్ 100' ఫేం పాయల్ రాజ్​పుత్ ఎంపికైనట్లు తాజాగా సమాచారం. మొదట వెంకీతో శ్రీయ నటిస్తుందని ప్రచారం సాగగా.. ఆమె స్థానంలో పాయల్​ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకీ... పల్లెటూరి అవతారంలో కనిపిచనుండగా, పట్టణంలో పుట్టి పెరిగిన కుర్రాడిగా నాగచైతన్య అలరించనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details