sitara

ETV Bharat / cinema

'మహానాయకుడా..జోహార్లు' - chandra babu naidu

'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రం ముందస్తు ప్రదర్శనను సినీ ప్రముఖులు తిలకించారు. అద్భుతంగా ఉందంటూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

ఏఎంబీ సినిమాస్​లో ఎన్టీఆర్ మహానాయకుడు ముందస్తు ప్రదర్శన

By

Published : Feb 22, 2019, 10:57 AM IST

Updated : Feb 22, 2019, 1:23 PM IST

నందమూరి తారక రామారావు సినీ, రాజకీయ జీవితాన్ని ఆవిష్కరిస్తూ ఆయన కుమారుడు బాలకృష్ణ నిర్మించి, ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎన్టీఆర్. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కిందీ చిత్రం. ఎన్టీఆర్​ రాజకీయ ప్రస్థానంపై తీసిన రెండో భాగం 'మహానాయకుడు' సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఏఎంబీ సినిమాస్​లో ఎన్టీఆర్ మహానాయకుడు ముందస్తు ప్రదర్శన

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్​లో గురువారం ముందస్తు ప్రదర్శన ఏర్పాటు చేశారు. నందమూరి కుటుంబ సభ్యులతోపాటు పలువురు సినీప్రముఖులు చిత్రాన్ని తిలకించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. ఎన్టీఆర్ ఆదర్శ జీవితాన్ని, కృషిని భావితరాలకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని నిర్మించినట్లు బాలకృష్ణ తెలిపారు.

Last Updated : Feb 22, 2019, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details