మురికివాడలో నివాసం ఉంటోన్న ఓ కుర్రాడు...తన తల్లిపై జరిగిన అత్యాచారం గురించి రాజధాని ప్రాంతానికి వెళ్లి, స్నేహితుల సాయంతో ప్రధానిని ఎలా కలిసాడనేదే ప్రధానంశం అని దర్శకుడు వివరించాడు. చిత్రంలో ఎనిమిదేళ్ల కుర్రాడి బాధను కళ్లకు కట్టినట్లు చూపించాం. ఇది మానవీయ కోణంలో చూడాల్సిన సినిమా అంటూ ఓం ప్రకాశ్ ప్రకటించాడు. రంగ్ దే బసంతి, బాగ్ మిల్కా బాగ్ , మీర్జా వంటి చిత్రాలను ఈయనే తెరకెక్కించాడు.
సామాజికమేనట... - mere pyar prime minister
'మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్' చిత్ర టైటిల్‌పై స్పష్టత ఇచ్చాడు దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా. ఇది రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం కాదు. సామాజిక అంశాలు, భావోద్వేగంతో కూడుకున్న సినిమా అంటూ వెల్లడించాడు.
మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్
"చిత్ర ట్రైలర్‌కు మేము ఊహించిన దానికంటే మంచి స్పందన వచ్చింది. ప్రజా సమస్యలు సహాజంగా, వాస్తవంగా కనిపించాలని సెట్లు వేయకుండా మురికివాడల్లో చిత్రీకరించాం. అక్కడి ప్రజలు షూటింగ్ సమయంలో బాగా మద్దతిచ్చారు" - రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా, దర్శకుడు
- ఈ చిత్రంలో అంజలీ పాటిల్, ఓం కనుజియా, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Last Updated : Feb 20, 2019, 4:41 PM IST