ప్రియా వారియర్‌తో 'లవర్స్ డే' జరుపుకోండి.! - priya warrier
'ఒరు ఆడార్ లవ్' ఈ సినిమా పేరు ఎవరికీ తెలియక పోవచ్చు. ప్రియా వారియర్ కన్ను గీటే సన్నివేశం మాత్రం అందరికీ గుర్తుంటుంది. ఆ సినిమాలోనిదే ఈ సన్నివేశం. తాజాగా ఈ చిత్రం 'లవర్స్ డే' పేరుతో తెలుగులో విడుదలవనుంది.
ప్రియా వారియర్.. ఒక్క కన్ను గీటే సన్నివేశంతో కుర్రకారు మతిపోగొట్టిన చిన్నది. ఆమె నటించిన మలయాళ చిత్రం 'ఒరు ఆడార్ లవ్'ను తెలుగులోకి అనువదించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లోని ముద్దు సన్నివేశం యువత మతిపోగొట్టింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు గురురాజ్, సి.హెచ్ వినోద్ రెడ్డి సుఖీభవ బ్యానర్‌పై అందిస్తున్నారు.
అల్లు అర్జున్ ఆడియో ఫంక్షన్‌కు అతిథిగా రావడంతో సినిమాకు మరింత హైప్ పెరిగిందని.. స్టైలిష్ స్టార్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నామని మరో నిర్మాత వినోద్ రెడ్డి పేర్కొన్నారు. చిత్రాన్ని ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లలో విడుదల చేస్తున్నామని తెలిపారు.