భారతీయ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు ఇంతవరకు రాలేదు. కొన్నిసార్లు నామినేట్ అయినా విజేతగా ఎప్పుడు నిలవలేదు. గతేడాది భారత మహిళల స్థితిగతులపై రూపొందించిన ఓ హిందీ లఘు చిత్రానికి నేడు ఆస్కార్ దక్కింది. 'పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్' అనే షార్ట్ ఫిల్మ్ ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్ర విభాగంలో అవార్డుని గెల్చుకుంది.
రుతుక్రమం సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించారు. సానిటరీ ప్యాడ్స్ వినియోగం లాంటి అంశాలపై మహిళల్లో అవగాహన తెచ్చే ప్రయత్నం చేశారు. రేకా బేహ్తాబ్చీ దర్శకత్వం వహించారు. భారత నిర్మాత గునీత్ మోంగా సినిమాను నిర్మించారు.
"మహిళల రుతుక్రమంపై తీసిన ఈ చిత్రం ఆస్కార్ గెలిచిందంటే నమ్మలేకపోతున్నాను"