sitara

ETV Bharat / cinema

రామకృష్ణ గ్రాఫికల్ వండర్స్

కోడి రామకృష్ణ చిత్రాలలో గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అవేంటో చూద్దాం.

By

Published : Feb 22, 2019, 6:33 PM IST

Updated : Feb 22, 2019, 7:48 PM IST

కోడి రామకృష్ణ

150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కోడి రామకృష్ణ అందరు హీరోలతో అన్ని రకాల జోనర్లలో సినిమాలు తీసి ఆకట్టుకున్నారు. భక్తి, హర్రర్, క్రైమ్, థ్రిల్లర్, కామెడీ చిత్రాలతో అలరించారు. ఆయన సినిమాల్లో గ్రాఫిక్స్​కు పెద్దపీట వేశారు.

తెలుగులో గ్రాఫిక్స్​కు కోడి రామకృష్ణ ఆద్యుడిగా చెప్పొచ్చు. అమ్మోరు సినిమాతో తన సత్తా ఏంటో చూపించారు. గ్రాఫిక్స్​తో విజువల్ వండర్ సృష్టించారు. ఆ తర్వాత 'దేవి' 'దేవీ పుత్రుడు', 'అంజి', 'అరుంధతి', 'నాగభరణం' చిత్రాలతో అలరించారు.

బొమ్మాలి నిన్నొదల అంటూ తెరకెక్కించిన అరుంధతి సినిమా ఘనవిజయం సాధించింది. అందుకు ప్రధాన కారణం సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దడం. అంజి, దేవీపుత్రుడు చిత్రాల్లోనూ అబ్బురపరిచే గ్రాఫిక్స్​తో ఆకట్టుకున్నారు.

చివరగా ఆయన తెరకెక్కించిన చిత్రం నాగభరణం. కన్నడ నటుడు విష్ణువర్ధన్ 1972లో తీసిన నాగరాహువు సినిమా రీమేక్ చేశారు. చనిపోయిన విష్ణువర్ధన్​ను గ్రాఫిక్స్​తో మళ్లీ తెరపై చూపించడం ఆయనకే చెల్లింది. ఇదే చిత్రంలో 120 అడుగుల పామును సృష్టించి ఔరా అనిపించారు కోడి.

ఇవీ చూడండి..కోడి హెడ్​బ్యాండ్ కథేంటి.!

Last Updated : Feb 22, 2019, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details