కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలిచిత్రం "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య"(1981). చిరంజీవి మాధవి జంటగా నటించారు. దాసరి నారాయణరావుని డైరక్టర్గా పరిచయం చేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు.
వంద సినిమాల కోడి - kodi ramakrishna
వంద చిత్రాలకు పైగా తెరకెక్కించిన దర్శకుడు కోడి రామకృష్ణ "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు.
కోడి రామకృష్ణ
తరంగిణి సినిమానే తొలి చిత్రంగా తీద్దామనుకున్నప్పటికీ... "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" చిత్రంతోనే దర్శకుడయ్యారు కోడి రామకృష్ణ. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకునిగా అరుదైన రికార్డు సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో వంద సినిమాలు తీసిన దర్శకుల్లో కోడి రామకృష్ణ, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్లు మాత్రమే ఉన్నారు.