చరిత్ర నేపథ్యంలో రూపొందిన సినిమాలు బాలీవుడ్లో చాలానే వస్తున్నాయి. 'మొహంజదారో', 'పద్మావతి', 'మణికర్ణిక' ఆ కోవలోకే వస్తాయి. తాజాగా అక్షయ్ కుమార్ ప్రధానపాత్రలో 'కేసరి' చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటీష్ కాలంలో జరిగిన 'సారాగర్హి' యుద్ధమే ఈ చిత్ర కథాంశం. నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
'కేసరి' గర్జన - akshay kumar
బ్రిటీష్ కాలంలో జరిగిన 'సారాగర్హి' యుద్ధమే కేసరి చిత్ర కథాంశం. అక్షయ్ కుమార్ ప్రధానపాత్రలో ఈ సినిమా తెరకెక్కింది.
కేసరి చిత్రంలో అక్షయ్ కుమార్
"నేను తన బానిసను, భారతీయులంతా మూర్ఖులని ఓ బ్రిటీష్ వ్యక్తి అన్నాడు. అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది" అంటూ అక్షయ్ పలికే డైలాగ్తో ట్రైలర్ మొదలైంది.
మార్చి 21న విడుదలవుతున్న ఈ చిత్రానికి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఫిలిమ్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Last Updated : Feb 21, 2019, 2:31 PM IST