బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నటించిన 'కేసరి' చిత్రంలో ఓ వీడియో సాంగ్ విడుదలైంది. 'సాను కెహందీ' అంటూ పంజాబీ మాండలికంలో ఉన్న గేయానికి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో అక్షయ్ పొడవాటి గడ్డంతో సర్దార్ వేషధారణలో కనిపిస్తున్నాడు.
కేసరి 'సాను కెహందీ' విడుదల - parineethi chopra
అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'కేసరి' మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కేసరిలో అక్షయకుమార్
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. పరిణీతి చోప్రా కథానాయికగా నటించింది. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కరణ్‌జోహార్ నిర్మించారు. తన్షిక్ బాగ్చీ సంగీతమందించారు.
1897లో జరిగిన సారాగర్హి యుద్ధంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు . 21 మంది సిక్కు సైనికులు 10వేలకు పైగా ఉన్న అఫ్గాన్ సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నారనేదే ఈ చిత్ర కథాంశం.