sitara

ETV Bharat / cinema

కంగనా గుర్రం ఉత్తుత్తిదే! - ఝాన్సీ లక్ష్మీభాయ్

పుల్వామా ఘటన తరవాత భారత్​-పాక్​ మధ్య సంఘర్షణ నడుస్తోంది. ఆ దేశ నటీనటులను భారత సినిమాల్లో  పాక్​ నటీనటులు నటించనివ్వకూడదని భారత చలనచిత్ర రంగం నిర్ణయం తీసుకుంది. పాక్​ దుశ్చర్యపై మండిపడ్డ సెలబ్రిటీల్లో కంగనా ఒకరు. అయితే ఆమెపై పాక్​దేశీయుడు ఛలోక్తులు విసిరాడు.

కంగనా గుర్రం ఉత్తుత్తిదే!

By

Published : Feb 22, 2019, 9:34 PM IST

క్వీన్​ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మణికర్ణిక. ఝాన్సీ లక్ష్మీభాయ్​ జీవితంలోని ప్రధాన ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

  • పాకిస్థాన్​పై విమర్శలు చేసినందుకు పాక్​ దేశీయుడు సఫీర్​ అన్సారీ ఓ వీడియో విడుదల చేశాడు. పాక్​పై యుద్దానికి కంగనా చూడండి ఎలా సిద్ధమౌతోందో అంటూ కామెంట్​ చేశాడు. పోరాట దృశ్యాలను ఓ డమ్మీ గుర్రం మీద కూర్చొని చిత్రీకరిస్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశాడు.

హాలీవుడ్​లోనూ ఇంతే:

కంగనా రనౌత్ గుర్రపు స్వారీ చేస్తూ బ్రిటిష్ సైనికులతో పోరాడే సన్నివేశం అది. కానీ క్వీన్​ స్వారీ చేస్తున్న గుర్రం నిజమైనది కాదు. అది ఒక ఎలక్ట్రిక్ గుర్రం. అది కదులుతూ ఉంటే కెమెరా సాయంతో కంగనా నిజంగా గుర్రంపై ఉన్న భ్రమ కలిగిస్తారు. ఒకప్పుడు ఇలాంటి సన్నివేశాలను డూప్​ల సాయంతో చేసేవారు. ఆధునికత పెరిగిన తరవాత గ్రాఫిక్స్​ ఉపయోగిస్తున్నారు.

హాలీవుడ్​లో సైతం ఇలాంటి చిత్రాలను ఇలానే తెరకెక్కిస్తారు. ఈ విషయమూ తెలియదా అంటూ ఆ పాక్ ​అజ్ఞానికి చురకలు పెడుతున్నారు నెటిజన్లు.

ABOUT THE AUTHOR

...view details