స్వయంకృషిలో చిరంజీవిని చెప్పులు కుట్టేవాడిగా చూపించిన ఘనత ఆయనదే. సాగరసంగమంలో కమల్‌హాసన్‌ను అమాయకుడిలా తెరకెక్కించిన గొప్పతనం ఆ దర్శకుడిదే. వెండితెరపై మానవుడి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించడం ఆయన ప్రత్యేకత. ఆయనే తెలుగు చలన చిత్రసీమకు ఎన్నో గొప్ప చిత్రాలు అందించిన కాశీనాధుని విశ్వనాధ్. ఈరోజు ఆయన 89వ పుట్టినరోజు.
ఆణిముత్యాలెన్నో..
1960లో సినీ దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన విశ్వనాథ్ ..తెలుగు ప్రేక్షకులకు ఆణిముత్యాల్లాంటి ఎన్నో చిత్రాలను అందించారు. శంకరాభరణం, శుభలేఖ, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వయంకృషి, స్వర్ణకమలం, స్వాతి కిరణం, ఆపద్భాందవుడు, శుభ సంకల్పం, స్వరాభిషేకం చిత్రాలు ఆ జాబితాలో ఉన్నాయి.