sitara

ETV Bharat / cinema

'తలైవి'గా జయలలిత - 'తలైవి'గా జయలలిత

తమిళనాడు లెజెండరీ సీఎం జయలలిత జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించనున్నారు. ఆదివారం ఆమె జయంతి సందర్భంగా చిత్ర టైటిల్​ను ప్రకటించింది చిత్రబృందం.

'తలైవి'గా జయలలిత

By

Published : Feb 24, 2019, 11:10 PM IST

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రిజయలలిత జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించనున్నారు. ఆదివారం ఆమె జయంతి పురస్కరించుకొని చిత్ర టైటిల్​ను ప్రకటించింది . తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నాడు దర్శకుడు విజయ్​. తలైవి పేరుతో వస్తోన్న ఈ బయోపిక్‌ అమ్మ జీవితాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.

జయలలిత పేరు ప్రఖ్యాతలు, ఆమె విజయాలను ఇందులో చూపించనున్నారు. ముఖ్యమంత్రిగా చేసిన పనుల ద్వారా తనకు స్ఫూర్తి కలిగిందని వెల్లడించాడు దర్శకుడు. ఈ చిత్ర స్ర్కిప్టుకు బాహుబలి కథారచయిత విజయేంద్ర ప్రసాద్‌ సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details