sitara

ETV Bharat / cinema

ఉరి 2.0 రాబోతోందా? - ఉరి 2.0

భారత వాయుసేన తీవ్రవాద స్థావరాలపై జరిపిన ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో సినిమా వచ్చే అవకాశం ఉందంటున్నాయి బాలీవుడ్ వర్గాలు..

ఉరి చిత్రంలో సన్నివేశం

By

Published : Feb 26, 2019, 6:30 PM IST

తీవ్రవాద స్థావరాలపై భారత వాయుసేన జరిపిన దాడులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైమానిక దళం, మోదీని అభినందిస్తూ సర్జికల్ స్టైక్ 2.0 అంటూ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్​లు వెల్లువెత్తుతున్నాయి.

బాలీవుడ్​లో వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమాలు ఘనవిజయం సాధిస్తున్నాయి. పాకిస్థాన్​పై భారత ఆర్మీ జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో తెరకెక్కిన 'ఉరి' సినిమా బాక్సాఫీస్ 200కోట్లకు పైగా కలెక్షన్లతో సాగుతోంది.

విక్కీ కౌశల్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. జనవరి 11న విడుదలైన ఈ సినిమాకు ఇంకా ఆదరణ తగ్గలేదు.

పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన జరిపిన దాడులను దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు. ఈ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో ఉరి సినిమాకు సీక్వెల్ దొరికినట్టైంది. వాయుసేన జరిపిన దాడుల నేపథ్యంలో మరో సినిమా వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నాయి సినీ వర్గాలు.

ABOUT THE AUTHOR

...view details