పాక్ నటుల బహిష్కరణ..! - rahat fateh ali khan
పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉన్న ఎవరినీ మేం ఉపేక్షించబోమని.. దేశ ప్రయోజనాలే ముఖ్యమని అన్నాయి చలన చిత్ర సంఘాలు.
పుల్వామా ఉగ్రదాడిపై పశ్చిమ భారత సినీ కార్మికుల సమాఖ్య(ఎఫ్‌డబ్ల్యూఐసీఈ), భారత చలన చిత్ర, టీవీ దర్శకుల సంఘంతో పాటు మరో పాటు 24 సంఘాలు గుర్గావ్లోని ఫిల్మ్ సిటీలో నిరసన తెలిపాయి.
క్రీడాకారులు సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రైనా, లక్ష్మణ్ కూడా తమ వాణిజ్య ప్రకటనల షూటింగ్‌ను వాయిదా వేసుకుని నిరసనలో పాల్గొన్నారు.
"ఈ ఘటన చాలా బాధాకరం. జవాన్ల త్యాగానికి ప్రతిఫలంగా వారికి ఎంతో కొంత సాయం చేయడం మన బాధ్యత" అని సెహ్వాగ్ అన్నారు.
"అమరులైన జవాన్ల త్యాగం వృథా కాదు. నటులు, క్రీడాకారులు హీరోలు కాదు.. 24 గంటలు దేశానికి కాపలాగా ఉంటున్న సైనికులే నిజమైన హీరోలు". అని హర్భజన్ పేర్కొన్నారు.
హిందీ చిత్రాల్లో పాకిస్థాన్ నటుల్ని, గాయకుల్ని బహిష్కరిస్తున్నామని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారీ స్పష్టం చేశారు. నవజ్యోత్ సింగ్‌ను కూడా బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. పాక్‌కు అనుకూలంగా ఉన్న ఎవరినీ మేం ఉపేక్షించబోమని.. దేశ ప్రయోజనాలే ముఖ్యమని వారు అన్నారు.