ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సిరీస్లో తదుపరి చిత్రం విడుదల ఆలస్యమవుతుందని ప్రకటించింది చిత్రబృందం. సిరీస్లో తొమ్మిదో చిత్రంగా వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కావల్సి ఉంది.
ఆలస్యంగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 - విన్ డీజిల్
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 చిత్రం విడుదల వాయిదా పడింది.
విన్ డీజిల్
ఈ సినిమా వాయిదా పడటం ఇది రెండోసారి. కొన్ని కారణాల వల్ల నెల ఆలస్యంగా...వచ్చే ఏడాది మే 22 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ప్రకటించింది చిత్ర బృందం. ఇదే రోజు వార్నర్ బ్రదర్స్ నిర్మాణంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' కూడా విడుదలవుతుంది. ఆలస్యానికి సంబంధించిన కారణాలను మాత్రం యూనివర్సల్ పిక్చర్స్ వెల్లడించలేదు.