ప్రేమికులుగా నటిస్తే చివరికలా..!
నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి నటుడు, ఆస్కార్ రేంజ్లో తెరకెక్కించగల సత్తా ఉన్న దర్శకుడు రితేష్ బాత్రా కాంబినేషన్లో 'ఫోటోగ్రాఫ్' చిత్రం కొత్త పోస్టర్ విడుదలైంది.
అవసరానికి ప్రేమికులుగా నటిస్తే ఏమైంది?
ఆస్కార్ నామినేటెడ్ 'ది లంచ్‌బాక్స్' చిత్రదర్శకుడు రితేష్ బాత్రా రొమాంటిక్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, సన్య మల్హోత్రా జంటగా తెరకెక్కిన ఫోటోగ్రాఫ్ సినిమా నూతన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. భారత్‌లో మార్చి 15న విడుదలకు సిద్ధమైంది. ఫోటోగ్రాఫ్ చిత్రానికి బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు అవకాశం లభించడం విశేషం.
- ముంబైకి చెందిన తన ఫోటోగ్రాఫర్ బామ్మ పెళ్లిచేసుకోమనే గోల తట్టుకోలేక.. ఒక పరిచయం లేని అమ్మాయిని భార్యగా నటించమంటాడు. విభిన్న అలవాట్లున్న ఇద్దరు ఎలా కలిసి ఉన్నారు. అవసరం కోసం ప్రారంభమైన జర్నీ చివరికి ఎక్కడ ముగిసిందనేదే కథాంశం.
Last Updated : Feb 16, 2019, 10:26 AM IST