sitara

ETV Bharat / cinema

'సైరా'కు నివాళి

బ్రిటీష్​ ప్రభుత్వ అరాచకాలు, నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ, వారిపై పోరాటం సాగించినందుకు...1847, ఫిబ్రవరి 22న  ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరితీశారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా సైరా చిత్రబృందం ఆయన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది.

By

Published : Feb 22, 2019, 8:33 PM IST

'సైరా'కు నివాళి

స్వాతంత్య్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర 'సైరా-నరసింహరెడ్డి'గా తెరకెక్కుతోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చిరు 151వ చిత్రం కావడం, చరిత్రను తెలిపే సినిమా కావడంతో భారీగా అంచనాలున్నాయి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడి వీరత్వాన్ని ఇందులో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు.

సైరా చిత్రబృందం నివాళి
  • ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న రాంచరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్​ కేటాయించారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా... బిగ్​బీ అమితాబ్​, జగపతిబాబు, విజయ్​ సేతుపతి, నయనతార వంటి ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details