మహానాయకుడు
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 22న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం ప్రకటించింది. నందమూరి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, చంద్రబాబుగా రానా నటిస్తున్నారు. సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు విజయవంతమైంది.