దబాంగ్ సహా పలు హిట్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైంది. దిల్లీలో గతేడాది సెప్టెంబరు 30న జరగాల్సిన కార్యక్రమంలో డ్యాన్స్ చేసేందుకు రూ.37 లక్షలు తీసుకొని హాజరు కాకపోవడమే ఇందుకు కారణం.
సోనాక్షిపై చీటింగ్ కేసు - BOLLYWOOD
డబ్బులు తీసుకొని కార్యక్రమంలో నర్తించని కారణంగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాతో పాటు మరో నలుగురిపై చీటింగ్ కేసు నమోదైంది.
సోనాక్షి సిన్హా
నవంబరు 24న నమోదైన ఫిర్యాదుకు గాను సోనాక్షి సిన్హాతో పాటు మరో నలుగురిపై కాట్గర్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.