sitara

ETV Bharat / cinema

"గర్వంగా ఉంది" - రజినీ కాంత్

పీఓకేలోని తీవ్రవాద స్థావరాలపై భారత వాయుదళం జరిపిన దాడులపై పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

సల్మాన్, మహేష్, సంజయ్ దత్, అక్షయ్

By

Published : Feb 26, 2019, 4:22 PM IST

భారత వాయుసేన పాక్ ఆక్రమిత కశ్మీర్​​లోని తీవ్రవాద స్థావరాలపై జరిపిన దాడులపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. క్రీడాకారులు, సినీ కళాకారులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.

"నేను ఉదయం నుండి చూస్తున్నాను. సాయుధ దళాలు ముందస్తుగా సన్నద్ధమై దాడికి దిగడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను, భద్రతా దళాల వల్లే దేశం ఉందని నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఈ దేశంలో నివసించడం చాలా అదృష్టం" అని లతా మంగేష్కర్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు.

భారత వాయుసేనను గౌరవిస్తున్నాని సల్మాన్ ట్వీట్ చేశాడు.

తీవ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన వాయుదళాన్ని చూస్తే గర్వంగా ఉందని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చాడు.

ప్రధాని మోదీని ట్విట్టర్​లో ట్యాగ్ చేస్తూ... "మెస్ విత్ ద బెస్ట్, డై లైక్ ద రెస్ట్" అంటూ అజయ్ దేవ్​గన్ సంతోషం వ్యక్తంచేశాడు.

రాహుల్ ట్వీట్​కు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ.. ప్రధాని మోదీకి సెల్యూట్ చేయడానికి ఇదే మంచి రోజంటూ సూచించేందుకు ప్రయత్నించాడు.

భారత వాయుసేన పట్ల గర్వంగా ఉంది.. పైలట్స్​కి సెల్యూట్ అంటూ టాలీవుడ్ హీరో మహేష్ బాబు ట్వీట్ చేశాడు.

"బ్రేవో ఇండియా" అంటూ సూపర్ స్టార్ రజినీకాంత్ ట్వీట్ చేశాడు.

వివేక్ ఒబేరాయ్, సోనూ సూద్, సోనాక్షి సిన్హా, సునిల్ శెట్టీ, .యామీ గౌతమ్ తదితరులూ ట్విట్టర్​లో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details