ఆలస్యంగా బాండ్-25 - జేమ్స్ బాండ్
summary బాండ్ సిరీస్లో 25వ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఎంజీఎం స్టూడియో ప్రకటించింది. రెండు నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాండ్-25
జేమ్స్ బాండ్ 25వ చిత్రం విడుదల తేదీ వాయిదా పడింది. రెండు నెలలు ఆలస్యంగా థియేటర్లకు వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. 2020 ఫిబ్రవరి 14న విడుదలవాల్సి ఉండగా ఏప్రిల్ 8కి వాయిదా వేస్తున్నట్లు స్టూడియో ఎంజీఎం తెలిపింది.
ఇప్పుడు క్యారీ ఫకునాగా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డేనియల్ క్రెగ్ ఐదోసారి బాండ్ పాత్ర చేస్తున్నాడు. ఇప్పటివరకు టైటిల్ ప్రకటించలేదు.