విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మహానాయకుడు'. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా ఎన్‌బీకే ఫిలింస్ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు.
'మాహానాయకుడు'లో పాత్ర వరం - mahanayakudu
ఎన్టీఆర్ జీవిత చరిత్ర రెండో భాగంగా తెరకెక్కిన 'మహానాయకుడు' శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి నటుడు బాలకృష్ణ, కల్యాణ్ రామ్ తమ అనుభవాలను పంచుకున్నారు.
బాలకృష్ణ, కల్యాణ్ రామ్
"నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ ఇంటి గడపకి పసుపునై బతకడానికి వచ్చాను"’ అనే డైలాగ్‌తో కూడిన ట్రైలర్ ఇటీవలే విడుదలై విశేష స్పందన పొందింది. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌కు సంబంధించిన రెండో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ చిత్రం విడుదల సందర్భంగా కథానాయకుడు బాలకృష్ణ, కల్యాణ్ రామ్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే చూద్దాం.