అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా "బద్లా". పింక్ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి సంబంధించి అమితాబ్ ట్విట్టర్లో పంచుకున్న మరో పోస్టర్ ఆహా అనిపిస్తోంది. ఆసక్తి పెంచుతోంది. పూర్తి రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఓ స్పానిష్ చిత్రానికి రీమేక్.
బద్లా 'కొత్త పోస్టర్' - TAPSEE
బిగ్‌బీ నటిస్తున్న బద్లా సినిమాకు సంబంధించిన మరో పోస్టర్ అభిమానులతో "వావ్ అమితాబ్" అనిపించింది.
అమితాబ్ బచ్చన్
షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా నిర్మిస్తోంది. ప్రచారంలో భాగంగా షారుఖ్, అమితాబ్ తీసుకున్న సెల్ఫీ ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సుజయ్ ఘోష్ ఈచిత్రానికిదర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ నటుడు టోని ల్యూక్ ఈ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. మార్చి 8న థియేటర్లలోకి రానుంది.