sitara

ETV Bharat / cinema

అమితాబ్ బచ్చన్ ఉదారత.. - martyrs

పుల్వామా దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు 5 లక్షల చొప్పున  విరాళం ప్రకటించారు అమితాబ్.

అమితాబ్ బచ్చన్

By

Published : Feb 16, 2019, 10:59 PM IST

పుల్వామాలో ఉగ్రవాదుల దుశ్చర్యకు దేశం యావత్తు దిగ్భ్రాంతి చెందింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సామాజిక మాధ్యమాల వేదికగా తమ విచారాన్ని వ్యక్తం చేశారు. 40 మంది వీరజవాన్ల కుటుంబాలకు 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించి ఉదారత చాటుకున్నారు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్.

"అవును. దాడిలో చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున విరాళం అందించేందుకు బచ్చన్ సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన ప్రక్రియపై ఆలోచన చేస్తున్నాం"-అమితాబ్ అధికార ప్రతినిధి

విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరగాల్సిన ఓ కార్యక్రమానికి బచ్చన్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. ఆ కార్యక్రమాన్ని శనివారానికి వాయిదా వేసుకున్నారు.

పుల్వామాలో జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించారు. ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details