sitara

ETV Bharat / cinema

"ఆర్టికల్​ 370ని రద్దు చేయాలి" - కంగనా

జమ్మూకశ్మీర్​లో ఆర్టికల్​ 370ని రద్దు చేయాలని బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ ప్రధానికి విజ్ఙప్తి చేసింది. పుల్వామా దాడిని కేవలం సైన్యంపై దాడిగా కాకుండా మనందరిపై జరిగిన దాడిగా పరిగణించాలని ఆమె అభిప్రాయపడింది.

కంగానా

By

Published : Feb 22, 2019, 7:04 AM IST

ఈ నెల 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ స్పందించింది. జమ్మూకశ్మీర్​లో ఆర్టికల్​ 370ని రద్దు చేయాలని ప్రధానికి విజ్ఙప్తి చేసింది. ఆర్టికల్​ 370 కారణంగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు, కొత్త చట్టాలు రూపొందించేందుకు పార్లమెంటుకు పరిమితులు అడ్డుపడుతున్నాయి.

"ముందు మనం ఈ దాడిని సైన్యంపై దాడిగా పిలవటం ఆపాలి. ఇది మనందరిపై జరిగిన దాడి. ఎందుకంటే సైనికులు మన రక్షకులు మన కోసం వారు ప్రాణాలర్పించారు. " - కంగనా రనౌత్​, బాలీవుడ్ నటి

ఈ సారి మనం నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి. స్వాతంత్య్రంవచ్పి ఇన్నేళ్లైనా ఓ రాష్ట్రప్రజలు తాము ఏ రాష్ట్రానికి చెందిన వారమో తేల్చుకోలేని అయోమయంలో ఉన్నారని కంగనా ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకోసం దేశ ప్రజలంతా కలిసి ప్రధానిని ఆర్టికల్​ 370ని రద్దు చేయాల్సిందిగా కోరి అది అమలయ్యేల చూడాల్సిన అవసరముందని కోరింది.

పాకిస్థానీ నటులపై నిషేధం గురించి కూడా కంగనా స్పందించింది. పాకిస్థాన్​ ప్రజలు మన సినిమాలను, మన నటులను ఇష్టపడతారు. కానీ కొన్ని సందర్భాల్లో గిరి గీసుకోక తప్పదని వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details