sitara

ETV Bharat / cinema

'రాక్షసన్'​ హీరోయిన్​ ఖరారు

తమిళ సినిమా రాట్ససన్​​కు రీమేక్​గా తెరకెక్కుతున్న సినిమాలో అనుపమ హీరోయిన్​గా ఖరారైంది. కథానాయకుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు.

By

Published : Feb 24, 2019, 12:32 PM IST

Updated : Feb 24, 2019, 3:01 PM IST

అనుపమా పరమేశ్వరన్

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న 'రాక్షసన్​' సినిమాలో ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్​గా నటించనుంది. తమిళ సూపర్​హిట్ చిత్రం రాట్ససన్​​కు రీమేకే ఈ చిత్రం. మాతృకలో ఉపాధ్యాయురాలి పాత్రలో అమలాపాల్ నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ పాత్రను అనుపమ పోషించనుంది.

కవచం సినిమా తర్వాత మరోసారి పోలీస్​గా కనిపించనున్నాడు శ్రీనివాస్. రమేశ్ వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గిబ్రాన్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

Last Updated : Feb 24, 2019, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details