ధైర్యం నేర్పిన అక్షయ్ - బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ ప్రముఖ బాలీవుడ్ నటుడే కాదు మంచి మార్షల్ ఆర్ట్స్ కళాకారుడుగానూ పేరుంది. ఇవే పాఠాలను విద్యార్థులకు నేర్పుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ధైర్యం నేర్పిన అక్షయ్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్కూల్ విద్యార్థినులకు ఆత్మరక్షణ పాఠాలు నేర్పించాడు. ఠానేలోని ఓ పాఠశాలలో వివిధ పాఠశాలలకు చెందిన 2వేల మంది అమ్మాయిలు పాల్గొన్నారు. అక్షయ్‌కుమార్ పాఠాలు నేర్పిస్తున్న వీడియో నెట్టింట వైరలైంది.
విద్యార్థినులకు శిక్షణ ఇస్తూ..
- మహిళా సమస్యలపై ప్యాడ్మాన్ చిత్రంతో మంచి ప్రశంసలు అందుకున్న ఈ నటుడు... ఈ విధంగా సామాజిక అంశాలపై ముందుకు రావటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్యాడ్ మాన్ వంటి చిత్రం తరవాతే... సమాజంలో నెలసరి సమస్యలపై మాట్లాండేదుకు మహిళలు ధైర్యం చేస్తున్నారు. ఎన్నో అవగాహన కార్యక్రమాలు కల్పించి ఆ సినిమా ఎంతో మందిలో ఆత్మస్థైర్యం నింపింది.