sitara

ETV Bharat / cinema

అదాశర్మ చించేసింది.! - mallakambh

అందాలతార అదాశర్మ సంప్రదాయ క్రీడ మల్లకంబు విన్యాసం చేస్తున్న వీడియోను ట్విట్టర్​లో పంచుకుంది.

అదాశర్మ

By

Published : Feb 18, 2019, 9:57 PM IST

హాట్ హాట్ ఫోటోషూట్లతో, వీడియోలతో సోషల్ మీడియా ఫాలోవర్స్​ను ఉక్కిరిబిక్కిరి చేసే టాలీవుడ్ ముద్దుగుమ్మ అదాశర్మ. హార్ట్​ఎటాక్, క్షణం సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది అదా. తాజాగా మల్లకంబు విన్యాసం చేస్తున్న వీడియోను ట్విట్టర్​లో పంచుకుంది. వీక్షకులతో వాహ్వా అనిపించికుంటోంది.

"మీరు మానసికంగా బలవంతులా... అయితే గాలిలో నిద్రపోండి" అంటోంది అదాశర్మ.

ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. గతంలోనూ ఇలాంటి వీడియోలతోనే కుర్రకారు మతి పోగొట్టింది.

అదా ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి చిత్రంలో నటిస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవే కాకుండా బాలీవుడ్​లో కమాండో 3, బైపాస్ రోడ్ సినిమాలతో బిజీగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details