ETV Bharat Bharat

bharat

ETV Bharat / bharat-news

ప్రపంచమంతా భారత్​వైపే - nations

జమ్ము ఉగ్రదాడిపై ప్రపంచదేశాలన్నీ భారత్​కు సహకరించనున్నాయి. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చాయి.

ప్రపంచమంతా భారత్​వైపే....
author img

By

Published : Feb 16, 2019, 8:00 AM IST

Updated : Feb 16, 2019, 2:11 PM IST

ప్రపంచమంతా భారత్​వైపే....
జమ్ముకశ్మీర్​ పుల్వామాలోని జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచదేశాలన్నీ భారత్​కు బాసటగా నిలిచాయి. అమెరికా, బ్రిటన్​, రష్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్​, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్​లు ముక్తకంఠంతో ఈ ఘటనను ఖండించాయి. పాకిస్థాన్​ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైష్​ ఏ మహమ్మద్​, ఇతర ఉగ్రవాద కార్యకలాపాలపై వ్యతిరేకంగా పోరాడటానికి భారత్​కు మద్దతు ప్రకటించాయి.
in article image

పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు అమరులయ్యారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​లకు సందేశం పంపారు. పాశవిక ఘటనను తీవ్రంగా ఖండించారు.

''దాడికి బాధ్యులైన వారికి కఠిన శిక్ష విధించాలి. ఈ కుట్ర పన్నినవారు, అమలుపర్చిన వారెవ్వరూ తప్పించుకోలేరు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్​తో కలిసి పనిచేసేందుకు మా దేశం సిద్ధంగా ఉంది.''

- పుతిన్​, రష్యా అధ్యక్షుడు

కశ్మీర్​ ఘటనతో షాక్​కు గురయ్యాం. బాధితుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో మేం భారత్​వైపే ఉంటాం.

- యూకే విదేశాంగ కార్యదర్శి

అమెరికాలోని శ్వేతసౌధం నుంచి పుల్వామా ఘటనపై ఒక ప్రకటన వెలువరించింది. ఉగ్రవాద నిరోధక పోరాటంలో భారత్​కు సహకరిస్తామని తెలిపింది.

''అన్ని ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్​ తన మద్దతును తక్షణమే ఉపసంహరించుకోవాలి. వారికి ఎలాంటి సాయం అందించకూడదు.''

- శ్వేతసౌధ ప్రకటన

ఆస్ట్రేలియాలోని రాజకీయ నేతలు ఈ ఘటనను హేయమైన చర్యగా పేర్కొన్నారు.

  • ''పుల్వామా దాడిలో మృతిచెందిన జవాన్ల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. భారత ప్రజలవైపే ఉంటాం.''- ఆస్ట్రేలియా రాజకీయ నేతలు
  • ఇదొక పిరికిపంద చర్య. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్​కు మా మద్దతు ఉంటుంది.- సౌదీ అరేబియా
  • ఈ ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. హింస, ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాల్సిందే.-యూఏఈ

ఉగ్రవాదుల చర్యతో ఎంతోమంది సాయుధ సిబ్బందిని కోల్పోయిన అఫ్గానిస్థాన్​ భారత్​తో కలిసి పోరాడుతామని ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో దేశాల మధ్య సమన్వయం ఉండాలని పిలుపునిచ్చింది.

వీటితో పాటు మాల్దీవ్స్​, భూటాన్​, బంగ్లాదేశ్​, శ్రీలంక, చైనా, గ్రీస్​, సౌతాఫ్రికా, పోర్చుగల్​, కొరియా, ఇండోనేసియా, సింగపూర్​ దేశాలు దాడిని ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశాయి.

Last Updated : Feb 16, 2019, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details