తిరుమలలో కనులపండువగా.. శ్రీవారి గరుడ వాహన సేవ
కొనేటి రాయడు.. శ్రీనివాసుడు.. గరుడ వాహనారూఢుడై... భక్తులకు దర్శనమిచ్చారు. సువర్ణ, రత్న, మణి, మయభూషణాలతో.. సర్వాలంకారశోభితుడై...గరడవాహనంపై అరుదెంచారు. తిరువీధుల్లో స్వామివారి శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ కోలాహలంగా సాగింది.
Last Updated : Oct 7, 2019, 12:56 PM IST