ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP State Committee Meeting

ETV Bharat / videos

TDP State Committee Meeting వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న టీడీపీ.. చంద్రబాబు అధ్యక్షతన నేడు సమావేశం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 10:37 AM IST

TDP State Committee Meeting: తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి పెద్దఎత్తున వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి 45 రోజులపాటు రాష్ట్రంలో ప్రతి ఇంటినీ సందర్శించాలని టీడీపీ తలపెట్టింది. ఇదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. వచ్చే రెండు నెలల్లో 30 అసెంబ్లీ నియోజకవర్గాలను సందర్శించి.. రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై నేడు అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో జరిగే  రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో ఈ కార్యక్రమాలకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ ఖరారు చేస్తారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అన్ని నియోజకవర్గాల ఇంఛార్జిలు, ముఖ్యనేతలు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొననున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను చంద్రబాబు ఇప్పటికే 145 స్థానాల్లో తన పర్యటనలు పూర్తిచేశారు. ఇంకా 30 నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది. వచ్చే రెండు నెలల్లో వీటిలోనూ సభలు నిర్వహించాలని ఆయన యోచిస్తున్నారు. ఒక్కో వారం 3 నుంచి 4 నియోజకవర్గాలు పూర్తి చేసే దిశగా ఆయన పర్యటన ఖరారు కానుంది. ప్రతి నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో బహిరంగ సభలు, రోడ్‌ షో నిర్వహిస్తారు.

ABOUT THE AUTHOR

...view details