ఇసుక అక్రమ తవ్వకాలకు మంత్రి పెద్దిరెడ్డే కారణం: టీడీపీ నేతలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2023, 3:46 PM IST
TDP Leaders Inspected Illegal Mining Area in NTR District :ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద మునేరులో ఇసుక అక్రమ తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లో పడి సోమవారం ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆ ప్రాంతాన్ని తెలుగుదేశం నేతలు పరిశీలించారు. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలుగుదేశం నాయకులతో కలిసి మునేరు వద్ద అక్రమ తవ్వకాలతో ఏర్పడిన గోతులను చూపిస్తూ ఆందోళన చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డే కారణమని ఆరోపించారు.
Three Youths Died Fell in Illegal Mining Pits : ఎటువంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు చేస్తూ తాడేపల్లి ప్యాలస్‌కి వేల కోట్లు తరలిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ సోదరుడికే ఇసుక కాంట్రాక్ట్‌ను అక్రమ మార్గంలో అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.