ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Hustle with gun: తుపాకీతో సచివాలయ ఉద్యోగి హల్​చల్​.. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి - Gun riot in Prakasam district

🎬 Watch Now: Feature Video

తుపాకీతో హల్చల్ చేసిన సచివాలయ ఉద్యోగి .. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

By

Published : Jun 29, 2023, 10:09 PM IST

Veterinary Assistant went on rampage with gun: ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని మూలపల్లె గ్రామంలో ఓ వ్యక్తి తుపాకీతో అందరినీ భయపెడుతూ హల్​చల్​ చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ సచివాలయం వెటర్నరీ అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్న పాలుగుల్ల మోహన్ రెడ్డి.. తన వద్ద ఉన్న లైసెన్స్ కలిగిన తుపాకీతో బుధవారం రాత్రి సమయంలో మూలపల్లె గ్రామంలో అలజడి సృష్టించాడు. తన వద్దకు వస్తున్న ప్రతి ఒక్కరిని తుపాకీ చూపించి భయపెట్టడం వల్ల.. కోపోద్రిక్తులైన గ్రామస్థులు అంతా ఏకమై మోహన్ రెడ్డిని పట్టుకొని ఓ స్తంభానికి కట్టివేసి దేహశుద్ధి చేసి.. పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై సుబ్బరాజు తన సిబ్బందితో మూలపల్లె గ్రామానికి చేరుకొని తుపాకిని స్వాధీనం చేసుకుని మోహన్ రెడ్డిని పోలీస్ స్టేషన్​కు తరలించారు. వివాహేతర సంబంధం నేపధ్యంలోనే ఇలా చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details