prathidhwani: సమస్యలపై ప్రశ్నిస్తే.. సంక్షేమ పథకాలు ఆపేస్తున్నారు
prathidhwani:రోడ్డు సమస్య ఉందీ అని విన్నవించుకుంటుంటే.. మాకు ఓటేయని వారికి అభివృద్ధిపై అడిగే హక్కు లేదంటారు ఓ సీనియర్ మంత్రి. ఫలానా కష్టం వచ్చింది అని వేడుకుంటే... ఇష్టమొచ్చిన దగ్గర చెప్పుకో పో అంటారు గౌరవనీయులైన రాష్ట్ర శాసన సభాధిపతి. ఈ జాబితాలో వీరిద్దరే మొదలో చివరో కాదు. వారి నోటికి హద్దు అదుపూ లేదు. ఎంత వస్తే అంత... ఏ మాట పడితే ఆ మాట... అలవోకగా అనేస్తున్నారు. ఇదేం తీరని అడిగితే... మేం అన్న మాటకు అర్థం వేరు బుజ్జి కన్నా అంటూ పొంతనలేని సమర్థనలతో విస్తుబోయేలా చేస్తున్నారు. సాధారణంగా ఇలా సమస్యలు ఉన్నాయని నేతలకు చెప్పుకోవడానికి వెళ్లేవారిలో ఎక్కువ మంది దళిత, బహుజనవర్గాల వారే అధికంగా ఉంటారు. కష్టం చెప్పుకోవడానికి, సమస్యలు తీర్చమని తమ వద్దకు వస్తున్న ప్రజల పట్ల అధికార వైసీపీలోని కొందరు నాయకులు.. ప్రజాప్రతినిధులు, మంత్రుల వ్యవహరిస్తున్న ఈ తీరు దేనికి సంకేతం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.