Maridamma Jatara: కన్నుల పండువగా మరిడమ్మతల్లి జాతర మహోత్సవాలు.. భారీ ఎత్తున తరలివస్తున్న భక్తులు
Mummidivaram Maridamma Jatara: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక పంచాయతీ పరిధి ఒడ్డెగుడెం గ్రామంలో శ్రీ మరిడమ్మతల్లి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడు సంవత్సరాల ఏడు నెలల ఏడు రోజులకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. మూడు నెలలు పాటు ఈ జాతర జరగనుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కాగడాలు వెలుగుల మధ్య మరిడమ్మ తల్లి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పూజారిని.. కాగడాలు వెలుగుల్లో చుట్టుపక్కల గ్రామాల్లో తిప్పుతూ డబ్బులు వాయిద్యాలు మధ్య ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో లైట్లు ఆర్పేసి కాగడాలు వెలుగుల మధ్య మరిడమ్మతల్లి ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సన్నివేశం చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా జాతర యువజన సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతోపాటు ఈ మహోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.