ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

High Tension in Nara Lokesh Yuva Galam Padayatra: నారా లోకేశ్​ పాదయాత్రపై రాళ్ల దాడి.. భీమవరం శివారులో ఉద్రిక్తత - భీమవరంలో నారా లోకేశ్

🎬 Watch Now: Feature Video

high_tension_on_nara_lokesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 9:15 PM IST

Updated : Sep 5, 2023, 10:08 PM IST

High Tension in Nara Lokesh Yuva Galam Padayatra:  నారా లోకేశ్ యవగళం పాదయాత్రలో వైసీపీ నేతల కవ్వింపుచర్యలు ఆగడం లేదు.  అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది.  సాఫీగా సాగుతున్న యువగళం పాదయాత్రకు(Yuva Galam Padayatra)  అడ్డంకులు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడంతో.. పలుచోట్ల ఉద్రిక్త పరిస్తితులు నెలకొంటున్నాయి. తాజాగా... పశ్చిమగోదావరి జల్లా భీమవరం శివారు గునుపూడిలో  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేశ్  పాదయాత్రలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 

పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్(Nara Lokesh) గునుపూడి రాకముందే వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలు చేపట్టాయి. గునుపూడి వంతెన వద్ద వైసీపీ కార్యకర్తలు పార్టీ జెండాలు ఊపుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేయడంతో.. పాదయాత్రలో విధులు నిర్వహిస్తున్న  కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తలకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు  కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను ఆస్పత్రికి తరలించారు. 

పాదయాత్రలో రాళ్ల దాడిపై నారా లోకేశ్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లరిమూకలు రెచ్చగొడుతున్నా పోలీసులు వారించే ప్రయత్నం చేయలేదని టీడీపీ(TDP) నేతలు ఆరోపిస్తున్నారు. ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో అల్లరిమూకల దాష్టీకంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. 

Last Updated : Sep 5, 2023, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details