Farmers Agitation: పొలాలకు దారి కల్పించాలంటూ.. గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను అడ్డుకున్న రైతులు
Farmers Agitation: న్యాయం చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. తమ పొలాలకు సాగు నీరు అందించాలని, అదే విధంగా పొలాలకు వెళ్లేందుకు దారి కల్పించాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ సమీపంలో విశాఖ నుంచి రాయ్‌పూర్ వరకు చేపడుతున్న గ్రీన్ పీల్డ్ రహదారి పనులను మెంటాడ రైతులు అడ్డుకున్నారు. బాధిత రైతులు గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఆందోళన చేపట్టడంతో హైవే నిర్మాణ పనులకు ఆటకం కలిగింది. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కారణంగా మిగులు సాగు భూములు బీడు భూములుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పంట భూములకు సాగునీరు సదుపాయం కల్పించాలని కోరారు. అదే విధంగా పండిన పంటను తరలించేందుకు అండర్ పాస్ సదుపాయం కల్పించాలని.. మిగులు భూములకు రహదారి సదుపాయం కల్పించాలంటూ.. నిర్మాణంలో ఉన్న గ్రీన్ పీల్డ్ రహదారిపై బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనతో దిగొచ్చిన గ్రీన్ పీల్డ్ రహదారి గుత్తేదారులు.. సమస్య పరిష్కారానికి అంగీకరించారు. అండర్ పాస్‌పై నుంచి మట్టిరోడ్డు వేసేందుకు అంగీకరించటంతో.. రైతులు ఆందోళన విరమించారు.