ఆంధ్రప్రదేశ్

andhra pradesh

visakha_railway_zone

ETV Bharat / videos

విశాఖ రైల్వేజోన్ కార్యరూపానికి అడ్డంకి ఎవరు ?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 9:17 PM IST

Prathidwani: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రజల నుంచి ఎంతోకాలంగా ఉన్న డిమాండ్. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఆ రోజు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే వీరి ఆశ పట్టాలెక్కే అవకాశం లేదా. ఇంతకాలం కేంద్రంపై నెపం వేస్తున్న ఈ విషయంలో అసలు దోషి జగన్ ప్రభుత్వమేనా. పోరాటాల ఫలితంగా వచ్చిన విశాఖ రైల్వేజోన్‌ వాస్తవం రూపం దాల్చకూడదనే వారు కోరుకుంటున్నారా. కేంద్ర రైల్వేమంత్రి వెల్లడించిన సమాచారమే రేకెత్తిస్తోన్న ప్రశ్నలివి. రైల్వే జోన్, రైల్వే లైన్లు, రైల్వే ప్రాజెక్టులు ఇలా ఏ విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సినవి సాధించిందా. పాతికమంది ఎంపీల్ని ఇస్తే కేంద్రం మెడలు వంచి విభజన హామీలు సాధిస్తామని పదేపదే చెప్పారు జగన్. ఇప్పుడు వైకాపాకు 23 మంది లోక్‌సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఏం సాధించారు. జోన్ ప్రధాన కార్యాలయం, ఇతర అవసరాలకు ఇవ్వాల్సిన భూమిని అప్పగించకుంటే ఏం చేసేదన్న ఆయన ప్రశ్నకు జగన్‌ ప్రభుత్వంలో ఆన్సర్ ఎక్కడ. ఇలాగైతే రైల్వేజోన్‌ సాకరమయ్యేది ఎప్పటికి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details