మహిళలపై హింసకు వ్యతిరేకంగా 16 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు - Gaddam Jhansi Conference On violence against women
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 7:53 PM IST
Dalit Stree Shakthi Convenor Gaddam Jhansi: ప్రపంచవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా.. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు... ప్రచారం చేయనున్నట్లు దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గడ్డం ఝాన్సీ తెలిపారు. విజయవాడలో దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో ప్రచార ఉద్యమ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం ఝాన్సీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఆదివాసి, దళిత స్త్రీలపై హింస పెరిగి పోతుందని తెలిపారు. హింసకు వ్యతిరేకంగా 16 రోజుల పాటూ... రోజుకో కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. లింగ వివక్ష, సమానత్వం, స్త్రీలపై హింస వంటి అంశాలపై పాఠశాలలు, కళాశాలలు, నగరాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.
దళిత శ్రీ శక్తి గత 17 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేపడుతుందని గడ్డం ఝాన్సీ తెలిపారు. స్త్రీల సమానత్వం కోసం.. వారి హక్కులను కాపాడటం కోసం పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళల రక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. అందుకోసమే యునైటెడ్ నేషన్స్ పిలుపు మేరకు దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. నవంబర్ 30వ తేదీన మహిళల హక్కులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 6వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో మహిళా హక్కులకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయమూర్తులతో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ స్త్రీల హక్కులను కాపాడడానికి ముందుకు రావాలని గడ్డం ఝాన్సీ పిలుపునిచ్చారు.