Pratidwani: అసలు రాష్ట్ర బడ్జెట్ నిర్వహణలో ఏం జరుగుతోంది ? - నేటి ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి.. ఆర్ధిక నిర్వహణపై ఇప్పటికే ఎన్నో దుమారాలు. విమర్శల జడి కురుస్తూనే ఉంది. ఆదాయం సంగతి దేవుడు ఎరుగు.. ఖర్చుల్లో.. అప్పుల్లో.. మనమే ముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వంద రూపాయలు ఖర్చు చేస్తే అందులో రూ.51 అప్పులే అన్న లెక్కలూ కలవర పెడుతున్నాయి. ఉన్న ఆ లోటుపాట్లు, కష్టాలు చాలవన్నట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండానే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారేమిటన్న కాగ్ సూటి ప్రశ్న అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో 50 వేల కోట్లు కేటాయించిన చోట రూపాయి కూడా ఖర్చు చేయాలేదన్న పరిశీలన ఆలోచనలో పడేస్తోంది. అసలు రాష్ట్ర బడ్జెట్ నిర్వహణలో ఏం జరుగుతోంది ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.