కడప జిల్లా వేంపల్లి మండలం వెలమవారిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా వైకాపా మద్దతుదారురాలు కృష్ణవేణి 51 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 35 సంవత్సరాలుగా కందుల కుటుంబ సభ్యులు చెప్పిన వారినే ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకొనేవారు. అయితే ఈసారి.. అక్కడ ప్రజలు వైకాపా బలపరిచిన అభ్యర్ధికి పట్టం కట్టారు. కృష్ణవేణిని గ్రామ ప్రజలు గెలిపించారు.
35 ఏళ్ల ఆనవాయితీకి స్వస్తి.. వైకాపా అభ్యర్ధి విజయం - కడప జిల్లా వెలమవారి పల్లిలో వైకాపా అభ్యర్ధి విజయం వార్తలు
కడప జిల్లా వేంపల్లి మండలం టి.వెలమవారిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా వైకాపా మద్దతుదారు కృష్ణవేణి గెలుపొందారు. 30 ఏళ్లుగా తిరుగులేని కుటుంబ పాలనకు స్వస్తి పలుకుతూ.. వైకాపా మద్దతుదారురాలు విజయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

వైకాపా అభ్యర్ధి విజయం
గత నెలలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికల సమయంలో.. ఈ గ్రామంలో అభ్యర్థులు ఎవరూ లేకపోవటంతో వాయిదా పడ్డాయి. తాజాగా గ్రామ సర్పంచ్ ఎన్నికలు నోటిఫికేషన్ రావటంతో.. ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు. గ్రామ ప్రజలు సైతం 35 ఏళ్ల ఆనవాయితీకి తిలోదకాలిస్తూ.. సంచలన తీర్పు ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృష్ణవేణి ధన్యవాదాలు తెలిపారు. టి.వెలమవారి పల్లె గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...