వైకాపా ఎంపీటీసీ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
వైకాపా ఎంపీటీసీ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి - వైకాపా ఎంపీటీసీ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
కడప జిల్లా మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి సంజీవ ప్రసాద్‌పై గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి కర్రలు, కత్తులతో దాడి చేశారు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు. నిన్న ఎంపీటీసీ అభ్యర్థిగా ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం నిన్న రాత్రి ఆయనపై దుండగులు దాడిచేయడం చర్చనీయాంశమైంది. గాయపడిన ప్రసాద్‌ను చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన ప్రసాద్