కడపలో మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనపై భగ్గుమన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు కానీ... మూడు రాజధానులు నిర్మిస్తారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ పెళ్ళికానుకలో ఇప్పటివరకూ ఒక్క పేద యువతికి డబ్బులివ్వ లేదని తులసిరెడ్డి ఆరోపించారు. సచివాలయ ఉద్యోగులకు 3నెలలుగా జీతాలు లేవన్న ఆయన... 45వేల మంది ఆశావర్కర్లకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని దుయ్యబట్టారు. ఇన్ని సమస్యల్లో ఉండి మూడు రాజధానులు నిర్మిస్తాననటం హాస్యాస్పదంగా ఉందని తులసిరెడ్డి మండిపడ్డారు.
మూడు రాజధానుల ప్రతిపాదనపై తులసిరెడ్డి ఏమన్నారంటే..! - thulasi reddy latest news
పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి వైకాపా పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై ధ్వజమెత్తారు. తులసిరెడ్డి కడపలో మీడియాతో మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న తులసీరెడ్డి