ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా ముగిసిన గండికోట ఉత్సవాలు - కడప

కడప జిల్లాలోని గండికోట వారోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి...తన శ్రీమతి అరుణతో కలిసి డాన్స్ చేయడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

ముగిసిన గండికోట ఉత్సవాలు

By

Published : Feb 11, 2019, 5:26 AM IST

కడప జిల్లా జమ్మలమడుగులో ముగిసిన గండికోట ఉత్సవాలు
కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని గండికోట
లో 2 రోజుల పాటు జరుగుతున్న గండికోట వారోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవంలో జిల్లా కలెక్టర్ హరి కిరణ్, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు.
కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకుడు బాలకృష్ణ, అమ్ములు గార్ల అన్నమాచార్య కీర్తనలు, యూత్ కల్చరల్ అసోసియేషన్ బ్రాండ్ అంబాసిడర్ అంబిక నృత్య ప్రదర్శనలు, గీతా మాధురి సినీ గీతాలాపన, జబర్దస్త్ రాము మిమిక్రీ కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, తన శ్రీమతి అరుణతో కలిసి డాన్స్ చేయడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

ABOUT THE AUTHOR

...view details