కడప జిల్లా జమ్మలమడుగు మండలం కన్నెలూరు గ్రామస్తులు.. వర్షం కోసం పూజలు చేశారు. 108 మంది మహిళలు కలశాలతో పవిత్ర గంగా జలాన్ని తీసుకుని గ్రామంలో ర్యాలీ చేశారు. శివాలయం సమీపంలో ఉన్న సుగాలమ్మ తల్లి వద్దకు వచ్చి 108 బిందెలతో అమ్మవారికి అభిషేకం చేశారు .ఈ కార్యక్రమంలో గ్రామస్థులంతా పాల్గొన్నారు.
వరుణ దేవా... కరుణించవా!
కడప జిల్లాలో వర్షం మొహం చాటేస్తోంది. చినుకు రాలక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్న ప్రజలు.. వర్షం కోసం వరుణ దేవుడిని ప్రార్థించారు.
జలాభిషేకం చేస్తున్న గ్రామస్థులు